హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీలపై ప్రభు త్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని అంగన్వాడీ(మినీ) టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఏ వరలక్ష్మి ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఈమేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్, మే నెలల జీతాలు ఇంతవరకు అందకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వరకు ఈహెచ్ఎస్ నమోదుకు చాన్స్
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టు (ఈహెచ్ఎస్)లో ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబ సభ్యులు (డిపెడెంట్ల) వివరాల నమోదు గడువును సర్కార్ పొడిగించింది. ఈ గడువు మే 31తో ముగియగా, తాజాగా ఈనెల ఈనెల 8 వరకు అవకాశానిచ్చింది. సర్వీస్ ఉద్యోగులరిజిస్టర్ల అప్ లోడింగ్ గడువును సైతం 8వరకు పొడిగించినట్టు తెలిపారు.