గీసుగొండ, జూన్ 2: అప్పుల బా ధతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా గీసుగొండ మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గీసుగొండకు చెందిన చాపర్తి రమేశ్ (45) తన 20 గుంటల భూమితోపాటు మరో ఐదు ఎకరాలను కౌలుకు తీసుకొని ఈ ఏడాది పత్తి, మక్కజొన్న పంటల ను సాగు చేయగా ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. పెట్టుబడికి, పిల్లల చదువు కోసం తెచ్చిన రూ.12 లక్షలు అప్పును ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన రమేశ్ సో మవారం ఆత్మహత్యకు యత్నించా డు. బాధితుడిని వరంగల్ ఎంజీఎం ద వాఖానకు తరలించగా, మంగళవారం మృతి చెందాడు.
మంటలు ఆర్పబోయి రైతు మృతి
జన్నార, జూన్ 2 : వరి కొయ్యలకు గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన నిప్పు ను ఆర్పే ప్రయత్నంలో ఓ వృద్ధ రైతు మరణించాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తి మ్మాపూర్‌లో చోటుచేసుకున్నది. ఎస్సై ఉదయ్‌కిరణ్ కథనం ప్రకారం. గ్రామానికి చెందిన రైతు రాయపోచం (70) పొలం పక్కన ఉన్న వరి కొయ్యలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఆ మంటలు ఆర్పే ప్రయత్నంలో రాయపోచం అందులో చిక్కుకొని దహనమయ్యాడు.