కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ( Kasipeta Mandal) ముత్యంపల్లి గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి మంద భీమయ్య (70) మద్యం మైకంలో గడ్డి మందు తాగి, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మంద భీమయ్య భార్య గత 13 ఏళ్ల క్రితం చనిపోగా అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు.
మంగళవారం సాయంత్రం తాగిన మైకంలో తన ఇంటిలో గడ్డి మందు తాగగా గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడని వివరించారు. మృతుడి సోదరడు మంద పోషం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.