INDA vs SAA : రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఏ’ జట్టు పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో ధ్రువ్ జురెల్(132 నాటౌట్) శతకంతో కోలుకున్న టీమిండియాను పేసర్లు గట్టెక్కించారు. ప్రసిధ్ కృష్ణ(3-35), ఆకాశ్ దీప్(2-28)లు నిప్పులు చెరగగా దక్షిణాఫ్రికాను 221కే ఆలౌట్ చేసి టీమిండియా ఆ తర్వాత భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. రెండోరోజు ఆట ముగిసే సరికి ఓపెనర్ కేఎల్ రాహుల్( 26 నాటౌట్), నైట్‌వాచ్‌మన్ కుల్దీప్ యాదవ్‌లు క్రీజులో ఉన్నారు. 3 వికెట్ల నష్టానికి 73 రుగులు చేసిన పంత్ బృందం ఆధిక్యం 112 పరుగులకు చేరింది.
సంచలన ఆటతో మొదటి అనధికారిక టెస్టును హస్తగతం చేసుకున్న భారత ఏ జట్టు రెండో మ్యాచ్‌లోనూ పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో టాపార్డర్ విఫలమైనా.. ధ్రువ్ జురెల్(132 నాటౌట్) సూపర్ సెంచరీతో ఆదుకోగా.. భారత పేసర్లు వికెట్ల వేటతో సఫారీలను హడలెత్తించారు. ప్రసిధ్ కృష్ణ(3-35), ఆకాశ్ దీప్(2-28)లు చెలరేగగా.. సీనియర్ టీమ్ సారథి తెంబా బవుమా(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. టాపార్డర్ కుప్పకూలినా కెప్టెన్ ఎంజే అకెర్మన్(134) టీమిండియా పేసర్లను దీటుగా ఎదుర్కొని అద్భత శతకంతో రాణించాడు. కానీ, అతడికి సహకారం అందించేవారు కరువవ్వడంతో 221కే ఆలౌటయ్యింది.
Akash Deep makes an immediate impact, dismissing Temba Bavuma for a first-ball duck in the A fixture! 👀#INDvSA #TembaBavuma #Sportskeeda pic.twitter.com/bldUfYqccT
— Sportskeeda (@Sportskeeda) November 7, 2025
తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ పేసర్ టియాన్ వాన్ వురేన్ (4-54) ధాటికి భారత ప్రధాన ఆటగాళ్లు చేతులెత్తేశారు. భారీ స్కోర్లు చేస్తారనుకుంటే కేఎల్ రాహల్(19), కెప్టెన్ రిషభ్ పంత్(24)లు నిరాశపరచగా.. జట్టును గట్టెక్కించే బాధ్యతను భుజాన వేసుకున్న జురెల్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. 119-6తో ఆలౌట్ అంచున నిలిచిన జట్టు ఆపద్భాదంవుడి పాత్ర పోషించిన జురెల్ టెయిలెండర్లు కుల్దీప్ యాదవ్(20), మహమ్మద్ సిరాజ్(15)లతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయితే ప్రసిధ్ కృష్ణ(0)ను ఔట్ చేసిన వురేన్ 255 వద్ద భారత ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
I think it’s time you promote Dhruv Jurel to number 3. pic.twitter.com/QvG2NC8cHj
— Abhishek Vibhute (@abvibhute) November 7, 2025