లక్నో: ఒక విద్యార్థినిని రెండు రోజుల పాటు హోటల్ గదిలో నిర్బంధించారు. ఇన్‌స్టా ఫ్రెండ్, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (Class 7 Student Raped) బాధిత బాలిక తల్లి ఫిర్యాదుతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. ఏడో తరగతి చదువుతున్న బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో విమల్ యాదవ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వారిద్దరూ మొబైల్ ఫోన్లలో చాట్ చేసుకున్నారు.
కాగా, నవంబర్ 2న తనను కలవాలని ఆ బాలికను విమల్ కోరాడు. ఆమె వేచి ఉన్న చోటుకు స్కార్పియో ఎస్‌యూవీలో అతడు వచ్చాడు. విమల్ స్నేహితులైన పియూష్ మిశ్రా, శుభం శుక్లా ఆ వాహనంలో ఉన్నారు. సరదాగా రైడ్ చేద్దామని ఆ బాలికతో విమల్ చెప్పాడు. ఆమెను కారులో ఎక్కించుకున్నారు. ఐఐఎం రోడ్డులోని హోటల్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఆ బాలిక మొబైల్ ఫోన్ లాక్కున్నారు. రెండు రోజుల పాటు అక్కడ నిర్బంధించారు. ఒకరు తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలిక ఇంటి సమీపంలో ఆమెను వదిలి పారిపోయారు.
మరోవైపు జరిగిన విషయాన్ని తన తల్లికి ఆ బాలిక చెప్పింది. వీడియో రికార్డ్ చేసి తనను బెదిరించినట్లు ఆరోపించింది. దీంతో కుమార్తెతో కలిసి ఆమె తల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులైన పియూష్, శుభమ్‌ను అరెస్ట్ చేశారు. బాలికను లోబర్చుకున్న ప్రధాన నిందితుడు విమల్ యాదవ్ పరారీలో ఉన్నాడని పోలీస్ అధికారి తెలిపారు. అతడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Seniors rag juniors | సైనిక స్కూల్లో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్.. వీడియో వైరల్
Man Robbed, Loses Leg | రైల్వే పోలీసుల నిర్లక్ష్యం.. కాలు కోల్పోయిన వ్యక్తి
Friends Stab Each other | రెండో పెళ్లి సంబంధంపై గొడవ.. కత్తులతో పొడుచుకున్న స్నేహితులు
Two Women Marry | సామాజిక కట్టుబాట్లను అధిగమించి.. ప్రేమ పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు