న్యూఢిల్లీ: వైవాహిక జీవితంలో విభేదాల వల్ల ఒక వ్యక్తి తన భార్యను పుట్టింట్లో వదిలేశాడు. రెండో పెళ్లి చేసుకోవాలని భావించాడు. మహిళతో పెళ్లి సంబంధం కుదర్చమని స్నేహితుడికి కొంత డబ్బు ఇచ్చాడు. రెండో పెళ్లి కోసం ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కత్తితో పొడుచుకున్నారు. (Friends Stab Each other) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. పెళ్లైన జగదీష్ చాలా కాలంగా వైవాహిక జీవితంలో విభేదాలు ఎదుర్కొంటున్నాడు. దీంతో భార్యను విడిచిపెట్టి రెండో పెళ్లి చేసుకోవాలని భావించాడు. స్నేహితుడైన 35 ఏళ్ల దీపక్‌కు ఈ విషయం చెప్పాడు. ఒక మహిళతో రెండో పెళ్లి సంబంధం కుదుర్చుతానని అతడు హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో దీపక్‌కు జగదీష్ రూ.30,000 ఇచ్చాడు.
కాగా, అక్టోబర్ 6న ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలిలోని అత్తవారింట్లో తన భార్యను జగదీష్ దించాడు. ఆ మరునాడు ఢిల్లీకి తిరిగి వచ్చాడు. ఫ్రెండ్ దీపక్‌తో ఆ రోజంతా గడిపాడు. ఆ రోజు సాయంత్రం రెండో పెళ్లి కోసం మరో రూ.30,000 చెల్లించాడు. ఆ రాత్రి 11 గంటల ప్రాంతంలో రిథాలాలోని బస్ స్టాండ్ సమీపంలో జగదీష్‌కు దీపక్ ఫోన్ చేశాడు. దీంతో అతడు అక్కడకు చేరుకున్నాడు.
మరోవైపు తనకు వాగ్దానం చేసిన రెండో భార్య మహిళ గురించి దీపక్‌ను జగదీష్ నిలదీశాడు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ మహిళ గురించి మరిచిపో లేకపోతే నీ అంతు చూస్తానని దీపక్ బెదిరించాడు. కత్తి తీసి జగదీష్ ఛాతిపై పొడిచాడు. దీంతో ఆత్మరక్షణ కోసం జగదీష్ ప్రయత్నించాడు. ఛాతిలో దిగిన కత్తిని బయటకు తీశాడు. ఆ కత్తితో దీపక్‌పై దాడి చేసి అతడ్ని పొడిచాడు. గాయపడిన దీపక్ అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ దాడి గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు కత్తి దాడిలో గాయడిన జగదీష్‌ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడిపై తొలుత కత్తితో దాడి చేసి దీపక్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ 10న అతడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అలాగే నవంబర్ 3న జగదీష్‌ను కూడా ఈ కేసులో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
Also Read:
Two Women Marry | సామాజిక కట్టుబాట్లను అధిగమించి.. ప్రేమ పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు
Man Abandons Son At Border | భార్యతో గొడవ.. దేశ సరిహద్దులో కుమారుడ్ని వదిలేసిన వ్యక్తి
Teen Set On Fire, Man Hanging | నిప్పంటించుకుని యువతి మృతి.. సమీపంలోని ఇంట్లో వ్యక్తి సూసైడ్