భోపాల్: కూలీ పని చేసుకునే వ్యక్తిని కొందరు వ్యక్తులు కొట్టారు. అతడ్ని దోచుకున్న తర్వాత రైలు పట్టాల వద్ద పడేశారు. కాళ్లపై రైలు వెళ్లడంతో ఒక కాలు తెగింది. తెగిన కాలు భాగాన్ని అక్కడ వదిలేసిన రైల్వే పోలీసులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు. (Man Robbed, Loses Leg) ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి ఒక కాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఈ సంఘటన జరిగింది. పాల్దునా గ్రామానికి చెందిన లఖాన్, ఉజ్జయిని రైల్వే సమీపంలో కూలీ పనులు చేస్తున్నాడు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఆహారం కొనుగోలు చేశాడు.
కాగా, దేవాస్ గేట్ వద్దకు లఖాన్ తిరిగి వెళ్తుండగా నలుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. అతడ్ని కొట్టి రూ.500 దోచుకున్నారు. రైలు పట్టాల వద్ద పడేయగా లఖాన్ కాళ్లపై రైలు వెళ్లింది. అతడు కళ్లు తెరిచేసరికి ఒక కాలు తెగింది. గాయమైన మరో కాలి నుంచి రక్తం కారింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు రాత్రి పది గంటల సమయంలో అక్కడకు చేరుకున్నారు. లఖాన్‌ను అంబులెన్స్‌లోకి ఎక్కించారు. రైలు పట్టాల వద్ద పడి ఉన్న తెగిన కాలు భాగాన్ని కూడా తీసుకురావాలని అతడు కోరాడు. అయితే రైల్వే పోలీసులు పట్టించుకోలేదు.
కాగా, హాస్పిటల్లో అడ్మిట్ అయిన లఖాన్ గురువారం ఉదయం తన తెగిన కాలు భాగం గురించి మరో రైల్వే పోలీస్ సిబ్బందికి మొరపెట్టుకున్నాడు. దీంతో ఏఎస్ఐ చొరవ వల్ల రైలు పట్టాల వద్ద పడి ఉన్న తెగిన కాలు భాగాన్ని ప్లాస్టిక్ సంచిలో హాస్పిటల్‌కు తెచ్చారు.
అయితే 12 గంటలకుపైగా ఆలస్యం కావడంతో తెగిన ఆ కాలు భాగాన్ని సర్జరీ ద్వారా కలపడం సాధ్యం కాదని డాక్టర్లు తెలిపారు. దీంతో రైల్వే పోలీసుల నిర్లక్ష్యం వల్ల లఖాన్ ఒక కాలు కోల్పోయాడు. దీనిపై స్పందించేందుకు రైల్వే పోలీస్ అధికారి నిరాకరించారు.
Also Read:
Two Women Marry | సామాజిక కట్టుబాట్లను అధిగమించి.. ప్రేమ పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు
Friends Stab Each other | రెండో పెళ్లి సంబంధంపై గొడవ.. కత్తులతో పొడుచుకున్న స్నేహితులు
Watch: పెంపుడు కుక్కను లిఫ్ట్‌లో చంపిన పనిమనిషి.. వీడియో వైరల్