అహ్మదాబాద్: ఒక సైనిక స్కూల్లో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. బలవంతంగా శిక్షించడంతోపాటు కర్రతో వారిని కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. (Seniors rag juniors) గుజరాత్‌లోని బాలచాడి సైనిక స్కూల్లో ఈ సంఘటన జరిగింది. ఒక సీనియర్ విద్యార్థి టవల్లో ఉన్నాడు. జూనియర్ స్టూడెంట్స్‌ను అతడు వేధించాడు. పుష్ అప్లు తీయమని బలవంతం చేశాడు. ఆ పొజిషన్లో ఉన్న వారిని వరుసగా కర్రతో కొట్టాడు. దీంతో కొందరు జూనియర్లు బాధతో అల్లాడిపోయారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే సైనిక స్కూల్లో ర్యాగింగ్ జరుగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్కూల్ యాజమాన్యం స్పందించింది. ఈ సంఘటనపై అంతర్గతంగా దర్యాప్తు చేస్తున్నది.
మరోవైపు అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు సియాంగ్ జిల్లాలో ఉన్న సైనిక స్కూల్లో సీనియర్ల వేధింపులకు జూనియర్ విద్యార్థి బలయ్యాడు. ఏడో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలుడ్ని చోరీ ఆరోపణలపై 8, 10వ తరగతి విద్యార్థులు కొట్టి హింసించారు. ఈ నేపథ్యంలో సూసైడ్ లెటర్ రాసిన ఆ విద్యార్థి నవంబర్ 1న స్కూల్ ఆవరణలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆ రాష్ట్రంలో కలకలం రేపింది.
શિસ્ત માટે જાણીતી બાલાચડી સૈનિક સ્કૂલ આવી વિવાદમાં: સ્કૂલમાં સિનિયર વિધાર્થી દ્વારા જુનિયર વિધાર્થીને માર મારવામાં આવતો હોવાનો વિડિઓ વાયરલ..#gujaratmirror #rajkot #rajkotcitypolice #students #viralvideo pic.twitter.com/COtJk23Iah
— Gujarat Mirror (@gujaratmirror26) November 5, 2025
Also Read:
Man Robbed, Loses Leg | రైల్వే పోలీసుల నిర్లక్ష్యం.. కాలు కోల్పోయిన వ్యక్తి
Friends Stab Each other | రెండో పెళ్లి సంబంధంపై గొడవ.. కత్తులతో పొడుచుకున్న స్నేహితులు
Two Women Marry | సామాజిక కట్టుబాట్లను అధిగమించి.. ప్రేమ పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు