Narayana Premier League | కంటేశ్వర్, నవంబర్ 7 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్స్ లో నారాయణ ప్రీమియర్ లీగ్ (NPL) జోనల్ స్థాయి క్రీడా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆదిలాబాద్ జోన్, నిజామాబాద్ జోన్ల నారాయణ స్కూల్స్ జోనల్ స్థాయి పోటీ కోసం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులలో క్రీడా స్ఫూర్తి, జట్టుకృషి, ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఎన్పీఎల్ (NPL)నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇందులో వివిధ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని, నారాయణ పాఠశాలల విద్యార్థులు ఎంతో ప్రతిభను ప్రదర్శించారని ఆ విద్యా సంస్థ ఏజీఎం శివాజీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈవో పీ అశోక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏజీఎంలు శివాజీ, ప్రసాద్, సిబ్బంది అశోక్, స్వాతి, సంగీత, కోఆర్డినేటర్లు రాకేష్, అజీమా, కల్పన, నరేష్, కళ్యాణి, చందన, రజని, కిషోర్, పార్వతి, ప్రభు, స్వర్ణలత, కరణ్ నేతృత్వంలోని క్రీడా బృందం, సాఫ్ట్ స్కిల్స్ బృందం, స్పోర్ట్స్ ఇంచార్జ్ పవన్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.