కాసిపేట : నేటి పోటీ ప్రపంచంలో విద్యకున్న ప్రాముఖ్యతను వయోజనులకు( Illiterate adults ) వివరించి వారిని అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేయాలని జిల్లా వయోజన విద్యా శాఖ అధికారి పురుషోత్తం నాయక్( Purushottam Nayak ) కోరారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట ( Kasipeta ) మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో శుక్రవారం జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో అమ్మకు అక్షరమాల ఉల్లాస్ పై శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణలో సెర్ప్ సీనియర్ సీఆర్పీలు మండల పరిధిలోని గ్రామ సంఘాల ఆఫీస్ బేరర్స్, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వయోజన విద్యాశాఖ అధికారితో పాటు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ స్వర్ణలత హాజరై వయోజన విద్యా ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం అమ్మకు అక్షరమాల అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. శిక్షణలో అందరికీ విద్యా ప్రాధాన్యం, వయోజన విద్య వల్ల కలిగే ప్రయోజనాలు, నిరక్షరాస్యతతో కలిగే సమస్యలు, మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలపై శిక్షణ అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణ, మండల విద్యాధికారి ముక్తవరం వెంకటేశ్వర స్వామి, వయోజన విద్యాశాఖ డీఆర్పీలు కొండు జనార్ధన్, శాంకరి, డీపీఎం స్వర్ణలత, ఏపీఎం రాజ్ కుమార్, సీనియర్ సీఆర్పీలు, సెర్ప్ సిబ్బంది, మండల సమాఖ్య ప్రతినిధులు, మండల సమాఖ్య సిబ్బంది, వీవోఏలు తదితరులు పాల్గొన్నారు.