రామగిరి, నవంబర్ 07 : నేటి సమాజంలో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా విద్యతో పాటు క్రీడలు, పలు అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు మోలికల్ ఫెస్ట్ నిర్వహించడం హర్షనీయమని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిసాఠి అన్నారు. నల్లగొంగలోని సెయింట్ ఆల్ఫోన్స్ హైస్కూల్లో డైమండ్ జూబ్లీ ఆడిటోరియం నూతన భవనం ప్రారంబోత్సవం- మోలికల్ టెస్ట్-2025 కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలల్లో ఇలాంటి ఫెస్ట్‌ల నిర్వహణతో విద్యార్థుల్లో ఐక్యతాభావం పెంపొందుతుందన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమేనని, అయితే పోటీల్లో కనబరిచిన సృజనాత్మకత ఆ విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీసేలా దోహదం చేస్తాయన్నారు.
నల్లగొండ డయాసిస్ బిషప్ రెవరెండ్ ఫాదర్ కరణం దమణ్ కుమార్ మాట్లాడుతూ.. గెలుపు ఓటములను సమంగా స్వీకరించాలన్నారు. ఇలాంటి పోటీలు పిల్లల్లో వారి ప్రతిభకు దర్పణం పడుతాయన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని అలరించాయి. ఈ వేడుకల్లో సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్ ప్రిన్సిపాల్ రెవరెండ్, బ్రదర్ హృదయకుమార్రెడ్డి, మోంట్ ఫోర్ట్ బ్రదర్ బాల ఇన్నా, బ్రదర్ బాస్టియన్ పూవే, ప్రొటెన్షియల్ సుపీరియర్ రెవరెండ్ బ్రదర్ శాజన్ ఆంథోని, హైదరాబాద్ ప్రొవెన్షియల్ సుపీరీయర్ బ్రదర్ షైన్అలెక్స్, మోలికల్ ఫెస్ట్ కన్వీనర్ రెవరెండ్ బ్రదర్ విన్సెంట్ రెడ్డి, బ్రదర్ సంతోశ్‌కుమార్, చిశ్రాంతో ఉపాధ్యాయులు నర్సిరెడి, మాజీ మున్సిపాల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నరేంద్రబాబు, డి.వి.ఎన్. రెడ్డి, పృథ్వీరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Ramagiri : విద్యతో పాటు పలు అంశాల్లో శిక్షణ హర్షనీయం : కలెక్టర్ ఇలా త్రిపాఠి