ఈ నెల 17న రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులతో కేంద్రమంత్రి భేటీ
ఈ నెల 17న రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శులతో కేంద్రమంత్రి భేటీ | కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ ఈ నెల 17న అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులతో సమావేశంకానున్నారు.

న్యూఢిల్లీ : కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ ఈ నెల 17న అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులతో సమావేశంకానున్నారు. ఈ సందర్భంగా విద్యారంగంపై కొవిడ్ మహమ్మారి ప్రభావంపై సమీక్షించనున్నారు. వర్చువల్ విధానంలోనే జరిగే సమావేశంలో ఆన్లైన్ ఎడ్యూకేషన్ను ప్రోత్సహించడం, నూతన జాతీయ విద్యా విధానం అమలుపై సమీక్ష జరుపనున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారని సంబంధిత శాఖ వర్గాలు పేర్కొన్నాయి. కొవిడ్-19ను ఎదుర్కొవడానికి రాష్ట్ర విద్యాశాఖలు చేసిన సన్నాహాలు, మహమ్మారి సమయంలోనూ ఆన్లైన్ విద్యను ఎలా కొనసాగించవచ్చో కేంద్రమంత్రి సమీక్ష నిర్వహిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొవిడ్-19 సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ 10వ తరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షను రద్దు చేయగా.. 12వ తరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షను వాయిదా వేసింది. మేలో జరగాల్సిన ఉన్నత విద్య అన్ని పరీక్షలను సైతం మంత్రిత్వ శాఖ వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
Good News : 2డీజీ డ్రగ్ వచ్చే వారం అందుబాటులోకి
బెర్హంపూర్ సర్కిల్ జైలులో 48 మంది ఖైదీలకు కరోనా
భారత్కు సాయం ప్రకటించిన న్యూయార్క్ సిటీ
మృతుల గౌరవాన్ని కాపాడేలా చట్టం తేవాలి : ఎన్హెచ్ఆర్సీ
నాగాలాండ్, అసోంలో భూకంపం
టీకాల్లో ‘ఇండియా ఫస్ట్’ విధానం ఏమైంది : కాంగ్రెస్ నేత
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

