కరిగిపోతున్న విదేశీ నిల్వలు
విదేశీ మారకం నిల్వలు కరిగిపోతున్నాయి. ఈ నెల 16తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 5.011 బిలియన్ డాలర్లు తరిగిపోయి 721.016 బిలియన్ డాలర్లకు పడిపోయినట్టు రిజర్వుబ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది.
- మరో 5 బిలియన్ డాలర్లు తరిగిపోయి 721 బిలియన్ డాలర్లకు..
ముంబై, అక్టోబర్ 23 : విదేశీ మారకం నిల్వలు కరిగిపోతున్నాయి. ఈ నెల 16తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 5.011 బిలియన్ డాలర్లు తరిగిపోయి 721.016 బిలియన్ డాలర్లకు పడిపోయినట్టు రిజర్వుబ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ రిజర్వులు 8.578 బిలియన్ డాలర్లు తగ్గి 726.027 బిలియన్ డాలర్లకు పడిపోయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 4న రికార్డు స్థాయి 785.706 బిలియన్ డాలర్లకు చేరుకున్న విదేశీ నిల్వలు..గడిచిన నెలన్నర రోజుల్లో 60 బిలియన్ డాలర్లకు పైగా పడిపోయాయి.
విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 5.758 బిలియన్ డాలర్లు తరిగిపోయి 591.847 బిలియన్ డాలర్లకు తగ్గడం మొత్తం రిజర్వులపై ప్రతికూల ప్రభావం చూపాయని తెలిపింది. కానీ, గోల్డ్ రిజర్వులు 706 మిలియన్ డాలర్లు ఎగబాకి 105.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కూడా 30 మిలియన్ డాలర్లు అధికమై 18.578 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఐఎంఎఫ్ వద్ద ఉన్న నిధులు 11 మిలియన్ డాలర్లు పెరిగి 4.791 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు తెలిపింది. ప్రవాస భారతీయులు డిపాజిట్ల కోసం ప్రత్యేక రాయితీ మార్పిడిలో భాగంగా భారీగా డబ్బులు పంపించడంతో బ్యాంకులు రికార్డు స్థాయిలో దాదాపు 133 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించినప్పటికీ, అవి క్షీణత ధోరణిలో ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

