ఇన్ఫీ లాభం 7,823 కోట్లు
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.7,823 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.7,364 కోట్ల లాభంతో పోలిస్తే 6.2 శాతం వృద్ధిని కనబరిచింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 23 : దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.7,823 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.7,364 కోట్ల లాభంతో పోలిస్తే 6.2 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షాకాలంలో కంపెనీ ఆదాయం రూ.44,490 కోట్ల నుంచి 10.2 శాతం వృద్ధితో రూ.49,244 కోట్లకు చేరుకున్నట్టు ప్రకటించింది. మరోవైపు, మరోసారి గైడెన్స్‌ను నిరాశపరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికా ఆదాయంలో 1-2 శాతం వరకు మాత్రమే వృద్ధి నమోదయ్యే అవకాశాలున్నాయని అవుట్‌లుక్‌లో పేర్కొంది.
గతంలో అంచనావేసిన 1.5 శాతం నుంచి 3 శాతం కంటే ఇది తక్కువ. అంతర్జాతీయ దేశాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు తోడు విచక్షణతో చేసే ఖర్చులు తక్కువగా ఉండటం వల్లనే ఆదాయ అంచనాల్లో కోత పెట్టినట్టు కంపెనీ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ తెలిపారు. గత త్రైమాసికంలో లైఫ్ సెన్సెస్, ఎనర్జీ, యుటిలిటీ, రిసోర్స్, సర్వీసెస్ రంగాల్లో 5.2 బిలియన్ డాలర్లు విలువైన ఒప్పందాల వల్లనే ఆదాయంలో రెండంకెల వృద్ధి నమోదైందన్నారు. గత త్రైమాసికంలో సంస్థ 4,480 మంది ఉద్యోగులను తీసుకోవడంతో మొత్తం సంఖ్య 3.32 లక్షలకు చేరుకున్నారు. అలాగే వలసలు 12.7 శాతంగా ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

