ఈసీ అధికారిపై ఇద్దరు కమిషనర్ల ఫిర్యాదు!
ఎన్నికల సంఘంలోని ఒక అధికారిపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు దాఖలు చేసిన ఫిర్యాదులపై క్యాబినెట్ సచివాలయం ఎటువంటి చర్య తీసుకోలేదని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) దరఖాస్తుకు సమాధానం లభించింది.
- అయినా చర్యలు చేపట్టని క్యాబినెట్ సచివాలయం
- ఆర్టీఐ సమాధానంతో వెలుగులోకి
న్యూఢిల్లీ, అక్టోబర్ 23 : ఎన్నికల సంఘంలోని ఒక అధికారిపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు దాఖలు చేసిన ఫిర్యాదులపై క్యాబినెట్ సచివాలయం ఎటువంటి చర్య తీసుకోలేదని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) దరఖాస్తుకు సమాధానం లభించింది. ఆ లేఖలు వారి వ్యక్తిగత హోదాలో రాశారని, అవి మొత్తం ఎన్నికల సంఘానికి ప్రాతినిధ్యం వహించవని ఆర్టీఐ దరఖాస్తుకు ఇచ్చిన స్పందనలో పేర్కొన్నారు. 2024 సెప్టెంబర్ 2న క్యాబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) ద్వారా ఎన్నికల సంఘానికి నియమితులైన ఐఏఎస్ అధికారి, సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మనీష్ గార్గ్ ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి జూలై 29న క్యాబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు.
హక్కుల కార్యకర్త కమోడోర్ లోకేష్ కే బాత్రా(రిటైర్డ్)కు ఆర్టీఐ సమాధానంలో ఆ లేఖలు అందచేశారు. ఓటర్ల రికార్డుల్లో మార్పులకు సంబంధించిన అధికారాలను రాష్ట్ర స్థాయి అధికారులకు బదులుగా కేంద్ర స్థాయిలోనే కేంద్రీకరించేలా గార్గ్ ఒక పని కేటాయింపు ఉత్తర్వును జారీ చేయగా దీనిపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు క్యాబినెట్ కార్యదర్శిని ఆశ్రయించారని సెప్టెంబర్‌లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. సెప్టెంబర్ 26న విడుదల చేసిన ఒక ప్రకటనలో గార్గ్ జారీ చేసిన ఈ పని కేటాయింపు ఉత్తర్వులను ఇద్దరు కమిషనర్ల ఆదేశాల మేరకు అమలు చేయలేదని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ఫిర్యాదులు డిప్యుటేషన్‌పై ఉన్న ఒక అధికారికి సంబంధించినవని, ఎన్నికల సంఘం పేర్కొంది.
ఎన్నికల కమిషనర్ల ఫిర్యాదు
ఆర్టీఐ సమాధానంలో చేర్చిన క్యాబినెట్ నోట్ ప్రకారం డిప్యూటీ ఎన్నికల కమిషనర్(పరిపాలన)కు లింక్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గార్గ్ తనకంటే సీనియర్ లేదా సమాన హోదాలో ఉన్న అధికారుల పని కేటాయింపులను మారు స్తూ ఉత్తర్వు జారీ చేశారని ఇద్దరు కమిషనర్ల ఆరోపణ. కమిషన్‌ను గానీ, సంబంధిత అధికారులను గానీ సంప్రదించకుండానే ఈ మార్పులు చేశారని ఫిర్యాదులో తెలిపారు.
క్యాబినెట్ సచివాలయం స్పందన
ఆగస్టు 3న సిద్ధం చేసిన ఒక క్యాబినెట్ నోట్లో ఈ ఫిర్యాదులపై ప్రధాన ఎన్నికల కమిషనర్ అభిప్రాయాన్ని కోరాలని ప్రతిపాదించారు. ఈ అంశంపై ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) అభిప్రాయాన్ని కోరవచ్చు. తదునుగుణంగా ఒక ముసాయిదా లేఖను ఆమోదం కోసం సమర్పిస్తున్నాము అని ఆ నోట్లో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

