Ben Duckett : రాజ్‌కోట్ టెస్టులో భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) విధ్వంసక సెంచరీతో ఫ్యాన్స్‌ను అలరించాడు. ఇంగ్లండ్ బజ్‌బాల్(Buzz Ball)కు కౌంటర్‌గా యశ్ బాల్ ఆటతో బెన్ స్టోక్స్(Ben Stokes) సేనకు చుక్కలు చూపించాడు. సిక్సర్ల మోత మోగిస్తూ సుదీర్ఘ ఫార్మాట్లో మూడో సెంచరీ, ఈ సిరీస్‌లో రెండో శతకం ఖాతాలో వేసుకున్నాడు. దాంతో, ఇంగ్లండ్ ఆటగాళ్లతో పాటు కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ సైతం యశస్వీని అభినందించాడు. అయితే.. యశస్వీ మెరుపు శతకం క్రెడిట్ కొంచెం తమకే చెందుతుందని ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(Ben Duckett) అన్నాడు.
‘రాజ్‌కోట్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వీ వీరోచిత సెంచరీలో మాకూ భాగముంది. ప్రత్యర్థి జట్లు టెస్టులను వన్డే తరహాలో ఆడడం వెనక ఇంగ్లండ్ ప్రభావం ఉంది. కెప్టెన్ బెన్‌స్టోక్స్, హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ ఆధ్వర్యంలో ఇంగ్లండ్ జట్టు బజ్ బాల్‌ను మొదలెట్టింది. అగ్రెస్సివ్‌గా ఆడడం ఈ ఆట స్పెషాలిటీ’ అని డకెట్ వెల్లడించాడు.
బెన్ డకెట్(153)
తొలి రెండు టెస్టుల్లో విఫలైమన డకెట్ రాజ్‌కోట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బుమ్రా, సిరాజ్, జడ్డూ, కుల్దీప్.. ఇలా ఏ ఒక్కరినీ వదలకుండా దంచి కొట్టాడు. ఈ విధ్వంసక ఓపెనర్ టీ సెషన్ తర్వాత క్షణాల్లోనే సెంచరీ కొట్టేశాడు. దాంతో, ఇంగ్లండ్ భారీ స్కోర్ కొట్టడం ఖాయమనిపించింది. కానీ మూడో రోజు కుల్దీప్, జడేజాలు తిప్పేయగా.. సిరాజ్ నాలుగు వికెట్లతో స్టోక్స్ సేన నడ్డి విరిచాడు. ఆ దెబ్బకు ఇంగ్లండ్ 319 పరుగులకే ఆలౌటయ్యింది.
యశస్వీ జైస్వాల్(104 రిటైర్డ్ హర్ట్), సిరాజ్
తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(104 : 133 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసక సెంచరీకి తోడూ శుభ్‌మన్ గిల్(65 నాటౌట్) హాఫ్ సెంచరీ బాదడంతో భారీ స్కోర్ చేసింది. 2 వికెట్ల నష్టానికి 196 రన్స్ కొట్టింది. దాంతో, ఆట ముగిసే సరికి రోహిత్ సేన ఆధిక్యం 322 పరుగులకు చేరింది.