చందంపేట (దేవరకొండ), సెప్టెంబర్ 10 : డాక్టర్ రాములు నాయక్ సేవలు మరువలేమని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలో నిర్వహించిన రాములు నాయక్ సంతాప సభలో ఆయన మాట్లాడారు. పేద ప్రజలకు డాక్టర్ రాములు నాయక్ ఎన్నో సేవలు చేసి, మెరుగైన వైద్యం అందించారన్నారు. దేవరకొండ ఏరియా ఆస్పత్రిలో ఎన్నో ఏళ్లుగా సేవలు చేశారని తెలిపారు. ఆయన సేవలను ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ మరువలేరన్నారు. అనంతరం రాములు నాయక్ చిత్రపటానికి పూలమాలసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శంకర్ నాయక్, బాబా, రాజు, రాములు గౌడ్, సత్యనారాయణ గౌడ్, కృష్ణ పాల్గొన్నారు.