PM Modi : ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) రేపు (గురువారం) ఉత్తరాఖండ్ (Uttarakhand) లో పర్యటించనున్నారు. ఉత్తరాఖండ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్లో తిరుగుతూ ఆయన ఏరియల్ సర్వే (Aerial survey) చేయనున్నారు. అనంతరం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం (Review meeting) నిర్వహించి ఆ రాష్ట్రంలో పరిస్థితి గురించి తెలుసుకోనున్నారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ జోలీ గ్రాంట్ ఎయిర్పోర్టు దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు. కాగా ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. దాంతో హమాచల్ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో వరదలు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంగళవారం హిమాచల్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రధాని పర్యటించారు.