కట్టంగూర్, సెప్టెంబర్ 10 : ఉపాధ్యాయ వృత్తి వెలకట్టలేనిదని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల అన్నారు. కట్టంగూర్ మండలానికి చెందిన 12 మంది మండల, ఐదుగురు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి బుధవారం ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు శాలవాలు కప్పి జ్ఞాపికలను అందజేసి మాట్లాడారు. సమాజంలో విద్యార్థులను తీర్చిద్దిదడంలో ఉపాధ్యాల పాత్ర కీలకం అన్నారు. విద్యతో పాటు విలువలు, ఆటల ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజెప్పే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
విద్యార్థులకు విద్యాదానం చేసి వారి అభ్యున్నతికి నిస్వార్థంగా కృషి చేసేది ఉపాధ్యాయులేనని, వారిని ప్రతి ఒక్కరు గౌరవించుకోవాలన్నారు. ఇన్చార్జి ఎంఈఓ అంబటి అంజయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు, ఏపీఓ కడెం రాంమోహన్, ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు, ఉపాధ్యాయులు ఎన్.వెంకటరమణ, పి.రాములు, ఎస్.పండరి, పి.శ్రీనివాసులు, సీఆర్పీ రవి, గోవర్దన్ పాల్గొన్నారు.