Vice President | భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణ ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నది. రాధాకృష్ణన్తో శుక్రవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారని అధికారు తెలిపారు. పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో జరుగుతుందని పేర్కొన్నారు. మంగళవారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి అయిన రాధాకృష్ణన్.. ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో గెలుపొందారు. జులై 21న అప్పటి రాష్ట్రపతి జగ్దీప్ ధంఖర్ ఉప రాష్ట్రపతికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.