మెహుల్ చోక్సీకి ఎదురుదెబ్బ.. బెయిల్ ఇచ్చేందుకు డొమినికా కోర్టు నిరాకరణ
మెహుల్ చోక్సీకి ఎదురుదెబ్బ.. బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ | పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి ఎదురుదెబ్బ తగిలింది.

రోజౌ : పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు డొమినికా హైకోర్టు నిరాకరించింది. డొమినికాతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, దేశం విడిచి పారిపోనని ఇచ్చిన హామీని పరిగణలోకి తీసుకోలేదు. తన సోదరుడితో కలిసి ఉంటానని కోర్టుకు తెలుపగా.. అది స్థిర నివాసం కాదని పేర్కొంది.
చోక్సీపై ఇంకా విచారణ ప్రారంభం కాలేదని గుర్తించిన కోర్టు.. ఇరుపక్షాల వాదనలు విన్నత తర్వాత న్యాయమూర్తి బెయిల్ ఇవ్వకూడదని నిర్ణయించారు. బెయిల్ కోసం కోర్టు ఎదుట బలమైన పూచీకత్తును ఇవ్వలేదని, విదేశాలకు పారిపోయే అవకాశం ఉండడంతో కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిందని ఆంటిగ్వా న్యూస్ రూమ్ పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో రూ.13,500 కోట్ల రుణం ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న మెహుల్ చోక్సీ 2018లో భారత్ విడిచి ఆంటిగ్వా బార్బుడాకు పారిపోయిన విషయం తెలిసిందే.
మే 23న విందు కోసం వెళ్లిన చోక్సీ ఆ తర్వాత డొమినికాలో కనిపించాడు. డొమినికాలోకి చోక్సీ అక్రమంగా ప్రవేశించినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. ఆంటిగ్వా నుంచి భారత్కు రప్పించేందుకు సీబీఐ, ఈడీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో క్యూబా పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే డొమినికాలో పట్టుబడినట్లు తెలుస్తోంది. అయితే, ఆంటిగ్వా బీచ్ నుంచి కిడ్నాప్ చేసి డొమినికాకు తీసుకువచ్చారని చోక్సీ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
కేంద్ర క్యాబినెట్లో మార్పులు?
లక్షమందితో హెల్త్ఆర్మీ
శ్రీశైలం, మహానందిలో దర్శన వేళల్లో మార్పులు
నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
13 మంది నక్సలైట్ల లొంగుబాటు
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

