లక్షమందితో హెల్త్ఆర్మీ

- థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవటానికి కేంద్రం సన్నాహాలు
- ఆరోగ్య సిబ్బంది కోసం ప్రత్యేక శిక్షణ
- వివిధ రంగాల్లో మూడు నెలల ట్రెయినింగ్
న్యూఢిల్లీ, జూన్ 11: కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో.. కేంద్రం సమాయత్తమవుతున్నది. లక్షమంది సుశిక్షితులైన ఆరోగ్య సిబ్బందిని (హెల్త్ఆర్మీని) సిద్ధంగా ఉంచటానికి ఒక ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వశాఖ ఈ మేరకు కసరత్తు చేపట్టిందని సంబంధిత అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. దీంట్లోభాగంగా దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లోని 194 జిల్లాల పరిధిలో ఉన్న 300 శిక్షణ కేంద్రాలను ఇప్పటికే గుర్తించామన్నారు. కొత్తవారిని తీర్చిదిద్దటమేగాక ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆరోగ్యసిబ్బంది నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు.
ఆరు రంగాల్లో శిక్షణ
శిక్షణ ఇవ్వటానికి ఆరు రంగాలను గుర్తించారు. అవి.. ఎమర్జెన్సీ కేర్ సపోర్ట్, బేసిక్ కేర్ సపోర్ట్, శాంపిల్ కలెక్షన్, హోం కేర్ సపోర్ట్, అడ్వాన్స్ కేర్ సపోర్ట్, మెడికల్ ఎక్వీప్మెంట్ సపోర్ట్. వీటిల్లో మూడు నెలలపాటు శిక్షణ ఉంటుంది.
ఐటీఐ పూర్తిచేసిన వారికి..
పలు రాష్ట్రాల్లో తగిన ఆరోగ్య సిబ్బంది లేకపోవటంతో ఆక్సిజన్ వెంటిలేటర్లు, కాన్సన్ట్రేటర్లు వంటి వైద్యపరికరాలు ఉన్నా కూడా వాటిని వినియోగించుకోలేకపోతున్నామని ఫిర్యాదులు వస్తుండటంతో.. వైద్యపరికరాల నిర్వహణపై కూడా ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. ఈ మేరకు 500 జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద పని చేయటానికి వీలుగా 20 వేల మంది ఐటీఐ పూర్తి చేసినవారిని అధికారులు ఇప్పటికే గుర్తించారు. వీరికి పూర్తిస్థాయిలో శిక్షణనివ్వనున్నారు.
ఇప్పటికే 2.25 లక్షల మందికి శిక్షణ
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఇప్పటికే కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖ 2,25,000 మందికి ఆరోగ్యకార్యకర్తలుగా పని చేయటానికి వీలైన సమగ్రమైన శిక్షణనిచ్చింది. ప్రస్తుతం మరో లక్ష మందిని సిద్ధం చేయనుంది. వీరు ప్రభుత్వ దవాఖానల్లో, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దవాఖానల్లోనేగాక పేషంట్లకు వారి ఇండ్లలోనే ఆరోగ్య సేవలు అందించటంలో శిక్షణ పొందుతారు. అంతేకాదు, కరోనా బారిన పడి మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించటంలో కూడా వీరికి శిక్షణ లభిస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- corona
- health army
- Third Wave
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

