Laluprasad Yadav : ఆర్జేడీ (RJD) అధ్యక్షుడు, బీహార్ (Bihar) మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) లో చుక్కెదురైంది. ల్యాండ్ ఫర్ జాబ్స్ (Land for Jobs) కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో ట్రయల్ కోర్టు విచారణ జరపకుండా స్టే విధించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ల్యాండ్స్ తీసుకుని ఉద్యోగాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసి చార్జీషీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం ట్రయల్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించాలంటూ లాలూ యాదవ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది.