నేరేడుచర్ల/ పాలకవీడు, నవంబర్ 28 : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితేనే ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతాయని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్నెతో పాటు పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెంలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వడ్లకు బోనస్ రావాలన్నా? ఆరుగ్యారెంటీలు అమలు కావాలన్నా? కాంగ్రెస్ ఓడి తీరాలన్నారు. ఎన్నికల్లో బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేకులని అన్నారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను వినియోగించుకొని ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. అక్రమ కేసులు పెట్టి అమాయకులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాతపెట్టాలన్నారు. శనివారం సూర్యాపేటలో నిర్వహించనున్న దీక్షాదివస్‌ను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు అరిబండి సురేశ్‌బాబు, కిష్టిపాటి అంజిరెడ్డి, నాయకులు సైదులు, నారాయణరెడ్డి, లింగయ్య యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, సుదర్శన్, శ్రీరామమూర్తి, వెంకట్‌రెడ్డి, నాగయ్య, రామారావు, మమత, మహబూబ్అలీ, అశోక్, వెంకట్‌రెడ్డి, నాగుల్‌మీరా, లక్ష్మీనారాయణ, సైదిరెడ్డి, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మిర్యాలగూడ, నవంబర్ 28: నల్లగొండలో శనివారం నిర్వహించనున్న దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణం రెడ్డికాలనీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీక్షా దివస్‌కు మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, అన్నభీమోజు నాగార్జునచారి, పెద్ది శ్రీనివాస్‌గౌడ్, ఎండీ ఇలియాస్‌ఖాన్, ఎండీ మగ్దూంపాషా, ఎండీ మాజీద్, ఎండీ షోయబ్, పునాటి లక్ష్మీనారాయణ, పెండ్యాల పద్మ, గుడిసె దుర్గాప్రసాద్, పశ్యా శ్రీనివాస్‌రెడ్డి, మన్నెం శ్రీనివాస్‌రెడ్డి, ఆంజనేయరాజు, ధనమ్మ, దినేశ్, ఇమ్రాన్, జాని, హబీబ్, వింజం శ్రీధర్, సాధినేని శ్రీనివాస్‌రావు, తిరందాసు విష్ణు, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ, నవంబర్ 28: బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట్ర సాధన కోసం దీక్ష చేసిన రోజునవంబర్ 29. నల్లగొండలో శనివారం దీక్షా దివస్ నిర్వహించడానికి బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమానికి మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, మండల, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని పార్టీ శ్రేణులు చెప్పాయి.
యాదాద్రి భువనగిరి, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 2009 నవంబర్ 29 కేసీఆర్ దీక్షా దివస్‌ను బీఆర్ఎస్ ఘనంగా నిర్వహించనుంది. శనివారం ఉదయం 10 గంటలకు భువనగిరిలోని రైతు బజార్ వద్ద నిర్వహించనున్న దీక్షా దివస్ నిర్వహణకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. జిల్లాలోని నలుమూలల నుంచి గులాబీ కేడర్ తరలి రానుంది. మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, తుంగ బాలు తదితరులు హాజరు కానున్నారు. ముందుగా అమరవీరుల స్థూపానికి నివాళులర్పించనున్నారు. ఉద్యమ గుర్తులతో ఉన్న ఫొటో ఫ్లెక్సీలను ప్రదర్శించనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను శుక్రవారం శేఖర్‌రెడ్డి, కంచర్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.