Maoists Sureender : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar)తో మావోయిస్టులకు తలదాచుకునే చోటు కరువైంది. ఇన్నాళ్లు కంచుకోటలా రక్షణనిచ్చిన ఛత్తీస్‌గఢ్, ఆంధ్ర సరిహద్దులోని దండకారణ్యాన్ని సీఆర్పీఎఫ్ బలగాలు జల్లెడ పడుతుండంతో కీలక నేతలు దండకారణ్యం వీడుతున్నారు. శుక్రవారం మహారాష్ట్రలో ఆయుధాలతో సహా 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
మహారాష్ట్ర గోండియా జిల్లా సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఎంఎంసీ జోన్ ముఖ్య ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ (Vikas) సహ 11 మంది లొంగిపోయారు. వికాస్‌పై రూ.1కోటి రివార్డు ఉంది. సరెండర్ అయిన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు.
Maoists operating in Maharashtra Madhya Pradesh and Chattisgarh have announced their decision to surrender on January 1, 2026.
A letter issued in the name of Anant, the MMC zone representative, stated that Maoists in the region will surrender collectively.
The letter stated… pic.twitter.com/WB1WmHF07B
— The Siasat Daily (@TheSiasatDaily) November 28, 2025
ఇటీవల కాలంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రధాన నేతలైన నంబాల కేశవరావు, జ్యోతి అలియాస్ సరిత, సురేశ్ అలియాస్ రమేశ్, లోకేశ్ అలియాస్ గణేశ్, మద్వి హిడ్మా (Madvi Hidma) వంటివారు ఎన్కౌంటర్లో మరణించడం.. మల్లోజుల, ఆశన్న వంటి పెద్ద నాయకులు లొంగిపోయిన నేపథ్యంలో ఒక్కొక్కరుగా జనజీవన స్రవంతితో కలిసిపోతున్నారు.