Kokapet Lands : కోకాపేట అంటేనే కోట్లకు కేరాఫ్‌గా మారిపోయింది. ఈ ప్రాంతంలోని భూములు, ఫ్లాట్లు కళ్లుచెదిరే ధర పలుకుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఎకరం రూ.140 కోట్లు దాటగా.. తాజా ఈ వేలం(E Auction)లోనూ రికార్డు ధరతో వార్తల్లో నిలిచింది కోకాపేట. నియోపోలీస్ లేఅవుట్లో హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం ప్రక్రియ శనివారం జరిగింది. ఫ్లాట్ నంబర్ 15, 16 ఈ రెండింటినీ భారీ ధరకు సొంతం చేసుకున్నాయి రెండు కంపెనీలు.
ఫ్లాట్ 15లో ఎకరం 151.25 కోట్లు పలికింది. 16వ ఫ్లాట్‌లో ఎకరం రూ.147.5 కోట్ల ధరకు అమ్ముడైంది. పదిహేనో ఫ్లాట్‌లో 4.03 ఎకరాలు లక్ష్మీనారాయణ కంపెనీ కొనగా.. 16 వ ఫ్లాట్‌లో గోద్రెజ్ కంపెనీ 5.03 ఎకరాలు కొన్నది. ఈ రెండు ఫ్లాట్లలో 9.06 ఎకరాల అమ్మకం ద్వారా హెచ్ఎండీఏకు రూ.1,353 కోట్ల ఆదాయం సమకూరింది.
In the latest Neopolis Auction 📰 (Kokapet, Hyderabad):
Plot No. 15, spanning 4.03 acres, was secured by GHR‑Lakshmi Infra for ₹151.25 crore ✅
Plot No. 16, also 4.03 acres, was won by Godrej Properties at a bid value of ₹147.75 crore 🎯
The Phase-3 land e-auctions are being…
— HydRealtyPro (@RealtyPulse1) November 28, 2025