Tanvi Sharma : సయ్యద్ మోడీ ఇంటర్నేషన్ (Syed Modi International)లో భారత యువ షట్లర్ తన్వీ శర్మ (Tanvi Sharma) సంచనాల పర్వం కొనసాగుతోంది. మాజీ వరల్డ్ ఛాంపియన్‌కు షాకిచ్చి వార్తల్లో నిలిచిన ఈ యంగ్‌స్టర్ మరోసారి అదిరే ప్రదర్శనతో సెమీఫైనల్ దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో హాంకాంగ్‌కు చెందిన లో సిన్ యాన్ హ్యాపీని వరుస సెట్లలో చిత్తు చేసింది తన్వి. మరో భారత అమ్మాయి ఉన్నాటి హుడా (Unnati Hooda) అతికష్టమ్మీద గట్టెక్కింది. పురుషుల సెమీస్‌లో మనదేశానికే చెందిన కిడాంబి శ్రీకాంత్, మిథున్ మంజునాథన్ తలపడనున్నారు.
సయ్యద్ మోడీ ఇంటర్నేషన్ సూపర్ 300 టోర్నమెంట్లో నమ్మశక్యంకాని ఆటతో ప్రత్యర్థులకు చెక్ పెడుతోంది తన్వీ శర్మ. ప్రీ-క్వార్టర్స్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమి ఒకుహర(Nozomi Okuhara)పై అద్బుత విజయంతో వైరలైన తను ఈసారి లో సిన్ యాన్ హ్యాపీని ఓడించింది.
TANVI SHARMA ROARS INTO THE SF OF THE SYED MODI INTERNATIONAL ❤️💙
A great comeback by Tanvi Sharma from 13-18 down in the second game to win the match 21-19
She defeated Lo Sin Yan Happy 21-13, 21-19🔥🔥🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/OXm5wDSSlu
— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) November 28, 2025
రెండు సెట్లలో జోరు చూపించిన 21-13, 21-19తో మ్యాచ్ ముగించింది. కేవలం 38 నిమిషాల్లోనే లో సిన్ను మట్టికరిపించిన భారత కెరటం దర్జాగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్ బెర్తుకోసం జాపాన్ క్రీడాకారిణి హినా అకేచీతో తన్వి తలపడనుంది. ఉన్నాటి తన ప్రత్యర్థి రక్షిత శ్రీ సంతోష్ (Rakshitha Sree Santosh)R 21-15, 13-21, 21-16తో సెమీస్ చేరింది. ఫైనల్ ఆడేందుకు టర్కీకి చెందిన నాలుగో సీడ్ నెలిషాన్ అరిన్‌ను ఉనాటి ఢీకొట్టనుంది.