అమర్నాథ్ యాత్రపై త్వరలో నిర్ణయం : జమ్మూకాశ్మీర్ ఎల్జీ
అమర్నాథ్ యాత్రపై త్వరలో నిర్ణయం : జమ్మూకాశ్మీర్ ఎల్జీ |

శ్రీనగర్ : అమర్నాథ్ యాత్ర నిర్వహణపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. అయితే, ప్రజల ప్రాణాలను కాపాడడమే తమ ప్రథమ ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. సముద్రమట్టానికి 3,880 మీటర్ల ఎత్తున, హిమాలయాల్లో ఉన్న మంచులింగాన్ని దర్శించుకునేందుకు ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 28న పహల్గామ్, బల్తాల్ మార్గాల్లో ప్రారంభమై.. ఆగస్టు 22తో ముగియనుంది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది యాత్రను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో యాత్రపై సందిగ్ధం నెలకొంది.
ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్ ఎల్జీ స్పందిస్తూ.. ‘కరోనా మహమ్మారిని పరిగణలోకి తీసుకొని త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం.. బహుశా రేపటికే (శనివారం) నిర్ణయం రావొచ్చు’ అన్నారు. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ‘అమర్నాథ్ యాత్ర ఈ సంవత్సరం జరుగుతుందా’ అని అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అంతకు ముందు ఆయన జమ్మూకాశ్మీర్లో అభివృద్ధి, భద్రతా పరిస్థితులపై కేంద్ర మంత్రి అమిత్షా ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు.
సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా, కేంద్ర ప్రభుత్వ ఉన్నత భద్రతా, ఇంటెలిజెన్స్ అధికారులు, జమ్మూ పరిపాలన హాజరైంది. ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్లో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితులు, భద్రతా చర్యలు.. పాక్ నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంట పరిస్థితులపై ఉన్నతాధికారులకు కేంద్రమంత్రికి వివరించారు.
ఇవి కూడా చదవండి..
సిబిల్ స్కోర్కు బ్యాంకు రుణాలకు సంబంధమేంటి?
WTC Final Day 1:: తొలి రోజు ఆట వర్షార్పణం
మిల్కాసింగ్ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
రేపటి నుంచి మరిన్ని ట్రైన్లు అందుబాటులోకి..
వ్యాక్సినేషన్లో మరో మైలురాయి దాటిన భారత్
త్వరలో అందుబాటులోకి మరో కరోనా టీకా!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

