చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ స్టార్ ప్లేయర్స్ డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ శుక్రవారం చెన్నైలో అడుగుపెట్టారు. వీళ్లతోపాటు టీమ్ అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హడిన్ కూడా వచ్చాడు. సన్‌రైజర్స్ టీమ్ ఈ విషయాన్ని తమ ట్విటర్లో వెల్లడించింది. ఈగిల్స్ ల్యాండ్ అయ్యాయి. ఈగిల్స్ ల్యాండ్ అయ్యాయని మళ్లీ చెబుతున్నాం. కెప్టెన్ డేవిడ్ వార్నర్, కేన్, బ్రాడ్ హడిన్‌లకు స్వాగతం అని సన్‌రైజర్స్ టీమ్ ట్వీట్ చేసింది.
14వ సీజన్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ టీమ్ తన తొలి ఐదు మ్యాచ్‌లను చెన్నైలోనే ఆడనుంది. తొలి మ్యాచ్‌ను ఈ నెల 11న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడుతుంది. ఐదు మ్యాచ్‌ల తర్వాత ఢిల్లీలో మరో నాలుగు, కోల్‌కతాలో మూడు, బెంగళూరులో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మధ్యే ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ తాను అందుబాటులో ఉండటం లేదని చెప్పడంతో అతని స్థానంలో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌ను సన్‌రైజర్స్ తీసుకున్న విషయం తెలిసిందే.
🚨The eagles have landed🚨
— SunRisers Hyderabad (@SunRisers) April 2, 2021
We repeat, the eagles have landed!
Welcoming skipper @davidwarner31, Kane and Brad Haddin to Chennai. Let’s go Risers! #OrangeOrNothing #ReturnOfTheRisers #OrangeArmy pic.twitter.com/jgclaoQLLB
గిఫ్ట్‌గా వచ్చిన మహీంద్రా థార్ కార్లతో నటరాజన్, శార్దూల్ పోజులు
వారణాసిలో సవాల్.. మోదీపై దీదీ పోటీ!
యూట్యూబర్ స్టంట్.. 50 గంటల పాటు సజీవ సమాధి.. వీడియో వైరల్
బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు.. రీపోలింగ్‌కు ఈసీ ఆదేశం
ఆ ఒక్క సిక్స్‌తోనే వరల్డ్‌కప్ గెలవలేదు: గంభీర్
టీ20 వరల్డ్‌కప్.. పాకిస్థాన్ క్రికెటర్లకు వీసాలు ఇస్తారా?
డివిలియర్స్ ఆల్‌టైమ్ ఐపీఎల్ లెవన్ ఇదే.. కెప్టెన్ ఎవరో తెలుసా?