జూబ్లీహిల్స్/బంజారాహిల్స్: ‘ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ప్రజల మనసులో ఎల్లకాలం గుర్తుండేలా వారి బాగోగులను చూడడమే మా ముందున్న కర్తవ్యం’ అని దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలు మాగంటి అక్షర, దిశిర పేర్కొన్నారు. శనివారం రహ్మత్‌నగర్ డివిజన్లోని పలు బస్తీల్లో బూత్ కమిటీ కార్యకర్తలతో కలిసి వారు పర్యటించారు.
స్థానికులను ఆప్యాయంగా పలకరించారు. మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు తమకు ఏ సమస్య రానివ్వలేదని.. ఏ సమస్య వచ్చినా తానే ముందుండి పరిష్కరించేవారని నూనె ఎల్లమ్మ అనే వృద్ధురాలితో పాటు స్థానికులు గుర్తు చేశారు. ‘మీకు ఏ సమస్య వచ్చినా.. మేము ముందుంటాం’ అని అక్షర, దిశిర వారికి అభయమిచ్చారు. అలాగే రహ్మత్‌నగర్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వారిని పాస్టర్ ప్రసాద్, ప్రమీల దంపతులు ఆశీర్వదించి శాలువలతో సత్కరించారు.