సిటీబ్యూరో: అల్పపీడనం ప్రభావంతో శనివారం నగరంలో మోస్తరు వాన కురిసింది. రాత్రి 9గంటల వరకు కుత్బుల్లాపూర్, గాయత్రీనగర్‌లో అత్యధికంగా 4.73 సెం.మీలు, షాపూర్‌నగర్‌లో 2.43, లింగంపల్లిలో 2.23, అల్వాల్‌లో 2.0 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.
రాగల మరో రెండు రోజులు పలు చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటితో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.