ఈ ఏడాది ‘థగ్‌లైఫ్’తో పలకరించారు కమల్‌హాసన్. ఆయన తదుపరి సినిమా కోసం సినీ ప్రియులంతా ఆతృతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో రజనీకాంత్‌తో కలిసి మల్టీస్టారర్ చేయనున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. సగటు ప్రేక్షకుడ్ని సైతం ఆనందింపజేసిన వార్త ఇది. అయితే.. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి టైమ్ పడుతుంది. కారణం రజనీ ప్రస్తుతం ఖాళీగా లేరు. ఆయన ‘జైలర్ 2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయితే గానీ ఇంకో సినిమా చేసే పరిస్థితి లేదు.
కాబట్టి రజనీ ఫ్రీ అయ్యే లోపు కమల్ కూడా ఓ సినిమా చేసేందుకు రెడీ అయిపోయారు. కవల స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బరివ్, పుష్కరిన్లలో ఒకరైన అన్బరివ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. కల్యాణి ప్రియదర్శిన్ కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం. ఇందులో కమల్ కొత్త లుక్‌లో కనిపిస్తారని, హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ ఎంటైర్టెనర్‌గా ఈ సినిమా తెరకెక్కిస్తామని మేకర్స్ చెబుతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్యామ్ పుష్కరన్ రచనా సహకారం అందించనున్న ఈ చిత్రాన్ని ఆర్.మహేంద్రన్‌తో కలిసి రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనున్నది.