Eagle Team Raids | సికింద్రాబాద్ కంటోన్మెంట్ : డ్రగ్స్‌ను నియంత్రించేందుకు తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఈగల్ టీం అధికారులు దూకుడు పెంచారు. బోయిన్పల్లి పీఎస్ పరిధిలోని మూతపడిన మేధా పాఠశాలలో ఈగల్ టీం అధికారులు దాడులు నిర్వహించారు.
పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించిన ఈగల్ టీం అధికారులు పాఠశాలలో అల్ఫాజోలం తయారు చేసే యంత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
పాత స్కూల్ భవనంలో మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించిన ఈగల్ టీం అధికారుల బృందం వారిని విచారిస్తోంది. గత కొంతకాలంగా మూతపడిన పాఠశాలలోనే అక్రమంగా మత్తు పదార్థాలను తయారు చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించినట్టు సమాచారం.
Edupayala Temple | పెరిగిన వరద.. వనదుర్గ ఆలయం మరోసారి మూసివేత
Rayapole | కొత్తపల్లిలో పడకేసిన పారిశుధ్యం.. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు
Tragedy | రెండేళ్ల కూతుర్ని పాతిపెట్టి.. ప్రియుడితో పరారైన మహిళ.. మూడు నెలల తర్వాత బయటపడ్డ నిజం!