టేకులపల్లి, సెప్టెంబర్ 25 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల పరిధిలోని మురళిపాడు బీట్లో ఒక ఎకరం పొలంలో పత్తి పంటను ఫారెస్ట్ అధికారులు రాత్రికి రాత్రి తొలగించినట్లు గురువారం రైతులు తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆళ్లపల్లి మండలం రాయపాడుకు చెందిన ఊకే నాగేశ్వరరావుకు చెందిన ఎకరం భూమిలో పత్తి సాగు చేశాడు. బుధవారం రాత్రి ఫారెస్ట్ అధికారులు వచ్చి చేనులో పత్తి మొక్కలను పీకేశారు. అంతేకాకుండా పట్టా భూమిలో ఉన్న పత్తి చేనును కూడా తీసేసినట్టు రైతు తెలిపాడు. స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకుని న్యాయం చేయాలని రైతులు కోరారు.