టేకులపల్లి : బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని కోదండ రామాలయం వద్ద బతుకమ్మ ఘాట్ ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదో రోజున అట్ల బతుకమ్మకు మహిళలు హాజరవుతారని, తక్షణమే బతుకమ్మ ఘాట్ ఏర్పాట్లను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మహిళలకు ఎలాంటి ఆటంకం కలవకుండా అన్ని రకాల వసతులు కల్పించాలని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. టేకులపల్లి ఎంపీడీవో కార్యాలయం సమీపంలో స్వచ్ఛత ఈ సేవలో భాగంగా శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.