Madhu Yaskhi | హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు సచివాలయంలోని ఆయన పేషీకి మధు యాష్కి వచ్చారు. అదే సమయంలో మధు యాష్కికి ఛాతిలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు, సిబ్బంది కలిసి మధు యాష్కిని చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. యాష్కి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది.