Ayodhya Airport | దేశంలోని విమానాశ్రయాల్లో నాసిరకం నిర్మాణాలపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. గతేడాది వర్షాకాల సమయంలో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టుతో సహా బీజేపీ పాలిత రాష్ర్టాలైన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్, గుజరాత్‌లోని రాజ్‌కోట్, యూపీలోని లక్నో విమాశ్రయాల్లో పైకప్పులు కూలడం, వర్షాలకు నీళ్ల లీకేజీ వంటి ఘటనలు జరిగాయి. తాజాగా అయోధ్య ఎయిర్పోర్ట్ (Ayodhya Airport)లో కూడా నీరు లీకవుతోంది (Airports Roof Starts Leaking).
సోమవారం అయోధ్య (Ayodhya)లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ D-1, D-2 పైకప్పుల నుంచి నీరు లీకైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించి రెండేళ్లు కూడా కాకముందే సమస్య తలెత్తడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), యూపీ సీఎం యోగి కలల ప్రాజెక్టులో భాగమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి రూ.1,450 కోట్లు ఖర్చు చేశారు. దీన్ని 2023, డిసెంబర్ 30న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అప్పట్లో దీన్ని అధునాతన సౌకర్యాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించినట్లు తెలిపారు.
ఇంత తక్కువ సమయంలో ఇంత మెరుగైన విమానాశ్రయం దేశంలో ఎక్కడా నిర్మించలేదని నిర్మాణ సంస్థలు కూడా పేర్కొన్నాయి. అయోధ్యకు వచ్చే ప్రయాణికులు, భక్తులు ఓ ప్రత్యేకమైన అనుభవాన్ని పొందుతారని కితాబిచ్చారు. అయితే, నిర్మాణం జరిగిన రెండేళ్లలోనే ఇలా నీరు లీకవడం నిర్మాణ పనుల నాణ్యతపై ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. బీజేపీ ప్రభుత్వంపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలో పదేండ్ల మోదీ ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యం వల్లే నాసిరకంగా మౌలిక సదుపాయాలు కూలిపోతున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
अयोध्या में डेढ़ साल पहले 1450 करोड़ रुपए से बना एयरपोर्ट टपक रहा है !!
ये स्टैंडिंग एरिया की छत है। pic.twitter.com/745FMrHRqA— Sachin Gupta (@SachinGuptaUP) September 16, 2025
Also Read..
KTR: బీజేపీ భక్తులు సూడో జాతీయవాదులు: కేటీఆర్
Dehradun | వరద ఉద్ధృతికి నదిలో కొట్టుకుపోయిన ట్రాక్టర్.. పది మంది గల్లంతు.. షాకింగ్ వీడియో