KTR: బీజేపీ భక్తులు సూడో జాతీయవాదులు: కేటీఆర్
KTR : బీజేపీ మద్దతుదారులు భారత రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించడం లేదని కేటీఆర్ అన్నారు. సూడో జాతీయవాదాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపించారు. బీఆర్ఎస్ నిజమైన జాతీయవాద పార్టీ అని ఆయన తన ఎక్స్‌లో పేర్కొన్నారు.
హైదరాబాద్: బీజేపీ భక్తులు సూడో జాతీయవాదులు అని, కానీ బీఆర్ఎస్ మాత్రం నిఖార్సైన జాతీయవాద పార్టీ అని కేటీఆర్ అన్నారు. తమకు జాతీయవాదం అంటే ప్రతి భారతీయుడిని సమానంగా చూడడం అని, కులం.. మతం.. వర్గంతో బేధభావం లేకుండా ఉంటామన్నారు. జాతీయవాదానికి, అతివాద దేశభక్తి మధ్య ఉన్న తేడాను గమనించాలన్నారు. తన ట్వీట్లో జైహింద్ అని పేర్కొన్న కేటీఆర్ .. పెహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాల మనోవేదనకు చెందిన కొన్ని న్యూస్ క్లిప్‌లను ప్రజెంట్ చేశారు.
బీజేపీ మద్దతుదారులు రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించడం లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని అడ్డుకుంటూ సుప్రీంకోర్టు స్టే ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతం పలికిందని, కానీ బీఆర్ఎస్ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న బీజేపీ భక్తులు .. అటు భారత రాజ్యాంగాన్ని కానీ, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కానీ గౌరవించడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో ఆయన ఈ కామెంట్ చేశారు.
సిగ్గులేని రీతిలో బీజేపీ నేతలు కపటత్వాన్ని ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ తలపడడాన్ని గుర్తు చేస్తూ పెహల్గామ్ ఉగ్రవాద బాధిత కుటుంబాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసినా.. బీజేపీ మాత్రం ఏమాత్రం పట్టించుకోనట్లు వ్యవహరించిందని విమర్శించారు. పెహల్గామ్ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, ఆ ఘటన జరిగి అయిదు నెలలు కూడా పూర్తి కాలేదని, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వాళ్లు బలయ్యారని, కానీ భారతీయ నేలపై ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తున్న దేశంతో టీమిండియా పోటీపడడడం పట్ల బీజేపీలో ఎటువంటి పశ్చాత్తాపం లేదని ఆయన అన్నారు. బాధిత కుటుంబాలు నిరసన వ్యక్తం చేసినా అమానవీయకర రీతిలో మోసం చేశారన్నారు.
As expected, some BJP bhakts are rattled by BRS Party welcoming the Supreme Court’s interim order on the Waqf Amendment Act 2025. They respect neither the Indian Constitution nor the orders of the apex court!
Let me remind them of their shameless hypocrisy
Barely five months… pic.twitter.com/qXGWp5YRMz
— KTR (@KTRBRS) September 16, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

