Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం : ఓ నిండు గర్భిణి నడిరోడ్డుపైనే ప్రసవించింది. రవాణా సదుపాయం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను డోలిలో మోసుకెళ్తుండగానే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బట్టిగూడెం గ్రామానికి చెందిన రవ్వ భీమేకు నెలలు నిండాయి. దీంతో ఆమెకు మంగళవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. కానీ బట్టిగూడెం గ్రామానికి రవాణా సదుపాయం లేదు. దీంతో చేసేదేమీ లేక నిండు గర్భిణిని.. కుటుంబ సభ్యులు డోలిలో మోసుకెళ్లారు.
అంబులెన్స్ వచ్చే మార్గం లేకపోవడంతో, బుదరలోనే 6 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లగా.. పురిటినొప్పులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో రవ్వ భీమే నడిరోడ్డుపైనే ప్రసవించింది. అక్కడి నుంచి తల్లీబిడ్డను ఆటోలో తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలో అంబులెన్స్ రావడంతో సత్యనారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు.
డోలిలో మోసుకెళ్తుండగా నడిరోడ్డుపైనే ప్రసవించిన గర్భిణీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బట్టిగూడెం గ్రామానికి చెందిన రవ్వ భీమేకు పురిటి నొప్పులు రావడంతో, డోలిలో మోసుకెళ్లిన కుటుంబసభ్యులు
అంబులెన్స్ వచ్చే మార్గం లేకపోవడంతో, బుదరలో 6 కిలోమీటర్ల దూరం మోసుకెళ్తుండగా నొప్పులు… pic.twitter.com/OfLkHVPbCV
— Telugu Scribe (@TeluguScribe) September 16, 2025