CJI Surya Kant | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Delhis Air Pollution) రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం ఉదయం కూడా గాలి నాణ్యత సూచిక ప్రమాదకర స్థాయిలో నమోదైంది. అనేక ప్రాంతాల్లో ఏక్యూఐ లెవెల్స్ 400కిపైగా నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని నగరంలో తీవ్ర కాలుష్యంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కాలుష్య సంక్షోభానికి పర్యావరణ నిపుణులు సమర్థవంతమైన పరిష్కారాన్ని కొనుగొంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. ‘ఢిల్లీని పీడిస్తున్న వాయు కాలుష్య సమస్యను నివారించడానికి స్వల్పకాలిక ఉపశమనం కలిగించే విధానాల కంటే.. దీర్ఘకాలిక పరిష్కారం కోసం చర్యలు అవసరం. ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా మారుతున్న ఈ వాయు కాలుష్య సమస్యకు నిపుణులు పరిష్కారం కనుగొంటారని నాకు నమ్మకం ఉంది’ అని అన్నారు.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం.. శుక్రవారం ఉదయం రాజధాని నగరంలో గాలి నాణ్యత గణనీయంగా క్షీణించింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో నగరంలో ఓవరాల్ ఏక్యూఐ లెవెల్స్ 305గా నమోదైంది. అత్యధికంగా ఆనంద్ విహార్ ప్రాంతంలో గాలి నాణ్యత సూచిక 390గా నమోదైంది. బవానాలో 379, నరేలా ప్రాంతంలో 356, ఆర్కే పురంలో 320గా ఏక్యూఐ నమోదైంది. నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత మెరుగ్గా నమోదైంది. NSIT ద్వారకలో 253, అరబిందో మార్గ్ (258), మందిర్ మార్గ్ (234), IGI విమానాశ్రయం T3 (239)గా గాలి నాణ్యత నమోదైంది.
Also Read..
UP Man Kills Wife | రహస్యంగా మొబైల్ వాడుతోందని.. భార్యను హత్య చేసి.. దృశ్యం సినిమాను తలపించే సీన్
Massive Fire | రాంచీలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
Railway Ticket Fares | ప్రయాణికులకు అలర్ట్.. పెంచిన రైలు చార్జీలు నేటి నుంచి అమల్లోకి