AlluArjun Trend | 2025 సంవత్సరం ముగింపుకి వచ్చిన సంగతి తెలిసిందే. మరో 5 రోజుల్లో కొత్త సంవత్సరం కూడా రాబోతుంది. అయితే ఈ ఏడాది ఇంటర్నెట్ ప్రపంచంలో ఏ టాలీవుడ్ హీరో హవా కొనసాగిందనే దానిపై గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ స్పష్టతనిచ్చింది. ఈ ఏడాది గూగుల్‌లో నెటిజన్లు అత్యధికంగా వెతికిన టాలీవుడ్ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. బాక్సాఫీస్ వద్దే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా బన్నీ తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.
గత ఏడాది చివరలో విడుదలైన ‘పుష్ప-2: ది రూల్’ దాదాపు రూ. 1800 కోట్ల గ్రాస్ వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమా సృష్టించిన ఇంపాక్ట్ వల్ల 2025 ఏడాది పొడవునా అల్లు అర్జున్ పేరు గూగుల్‌లో మారుమోగిపోయింది. అనంతరం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న ‘AA22’ (వర్కింగ్ టైటిల్) సినిమాపై ఉన్న భారీ అంచనాలు అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండటం వంటి విషయాలు బన్నీని టాప్‌లో నిలబెట్టాయి. ఇక అల్లు అర్జున్ తర్వాత రెండో స్థానంలో రెబల్ స్టార్ నటుడు ప్రభాస్ నిలిచాడు. కల్కి 2 సినిమాతో పాటు స్పిరిట్ చిత్రాలు అతడిని రెండో స్థానంలో నిలిచేలా చేశాయి. మూడో స్థానంలో మహేశ్ బాబు నిలువగా.. నాలుగో స్థానంలో పవన్ కళ్యాణ్, ఐదో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నిలిచాడు.