హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక విశ్రాంతి గదులు, క్రెచ్ సౌకర్యాలు (శిశు సంరక్షణ కేంద్రాలు), బందోబస్తు సమయంలో మొబై ల్ టాయిలెట్లు, పెట్రోలింగ్ కోసం సూ టర్లు ఏర్పాటు చేయాలని పోలీసు అకాడమీ డైరెక్టర్ డీజీ అభిలాష్త్ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. శుక్రవారం సచివాలయంలో ‘ఫస్ట్ తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ ఉమెన్ ఇన్ పోలీస్’ అనే ప్రత్యేక పు స్తకాన్ని ‘ఆర్బీవీఆర్ఆర్ టీజీపీఏ’ యా న్యువల్ మ్యాగజైన్-2025ను సీఎం ఆవిషరించారు. మొదటి ఉమెన్ కాన్ఫరెన్స్‌లో తీసుకున్న నిర్ణయాలను, సమస్యలను మహిళా పోలీసు ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేర పరిశోధన, ట్రాఫిక్ నిర్వహణ, బందోబస్తు విధుల్లో మహిళా పోలీసులు పోషిస్తున్న పాత్రను ముఖ్యమంత్రి కొనియాడారు.
ఫైర్ సేఫ్టీకి అడ్వాన్డ్స్ ఎక్విప్మెంట్ వాడాలి
హైదరాబాద్‌లో ఫైర్ సేఫ్టీ విషయంలో అడ్వాన్డ్స్ ఎక్విప్మెంట్ వినియోగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో మున్సిపల్, పట్టణాభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో సూచించారు.
సీఎంతో మాజీ మావోయిస్టుల భేటీ
ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్‌తో భేటీ అయ్యా రు. సచివాలయానికి వచ్చిన తిప్పిరి తిరుపతి (దేవ్ జీ), మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్), పుల్లూరి ప్రసాదరావు (చంద్రన్న), పోతుల కల్పన (సుజాత), బడే చొకారావు (దామోదర్), నూనె నర్సింహారెడ్డి (గంగన్న) సీఎంతో గంట పాటు సమావేశమయ్యారు. రాజకీయ, సామాజిక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. భేటీ అనంతరం మాజీ నేతలు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఇప్పటికే రాజకీయాల్లోకి వస్తామని లొంగుబాటు సమయంలోనే ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే ఈ భేటీ జరిగినట్టు చర్చ జరుగుతున్నది.