వివాహితను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాన్సువాడలో ఓ మహిళను ఏనుగు రవీందర్ రెడ్డి ప్రధాన అనుచరుడైన దేవేందర్ రెడ్డి కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయం సదరు మహిళ ఆమె భర్తకు చెప్పడంతో దేవేందర్ రెడ్డికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో దేవేందర్ రెడ్డిపై ఎస్టీ,ఎస్టీ అట్రాసిటీతో పాటు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.
బాన్సువాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిలను కాంగ్రెస్ నాయకుడు ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రధాన అనుచరుడైన దేవేందర్‌రెడ్డి వేధింపులకు గురిచేస్తున్నాడు. నెలరోజులుగా దేవేందర్‌రెడ్డి వేధింపులు భరించలేక సదరు మహిళ తన భర్తకు విషయం చెప్పింది.
గురువారం కూడా మహిళను దేవేందర్‌రెడ్డి వేధిస్తుండగా ఆమె భర్త అక్కడికి చేరుకొని అతడిని పట్టుకున్నాడు. తీవ్ర ఆగ్రహం చెందిన ఆయన దేవేందర్‌రెడ్డిని దవాఖాన నుంచి నడిరోడ్డుపై చెప్పులతో కొడుతూ పోలీసు స్టేషన్ వరకు తీసుకెళ్లి, పోలీసులకు అప్పగించాడు. బాధితురాలిని, ఆమె భర్తను కాంగ్రెస్ నాయకుడు బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితంలేకపోయింది. సాయంత్రం బాధిత కుటుంబ సభ్యులు పోలీసుస్టేషన్‌కు వెళ్లినట్టు సమాచారం. గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి వర్గంలో పనిచేసిన దేవేందర్‌రెడ్డి ప్రస్తుతం ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నాడు.
వివాహితను నెల రోజులుగా లైంగికంగా వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడి అనుచరుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు లైంగిక వేధింపుల కేసు నమోదు
కామారెడ్డి బాన్సువాడలో వివాహితను నెల రోజులుగా లైంగికంగా వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు దేవేందర్ రెడ్డిపై ఎస్సీ,… https://t.co/oAuGvA5L4G pic.twitter.com/8BCE3GVvhx
— Telugu Scribe (@TeluguScribe) December 26, 2025