Massive Fire | జార్ఖండ్ (Jharkhand)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది (Massive Fire). రాజధాని రాంచీ (Ranchi)లోని ఓ అపార్ట్మెంట్ (residential apartment)లో శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పురానా అర్గోరా చౌక్ నుంచి కట్ల మోర్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న అపార్ట్మెంట్లోని 12వ అంతస్తులో మంటలు వ్యాపించాయి. మంటల ధాటికి పెద్దఎత్తున పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదంతో నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కిందకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
#WATCH | Ranchi, Jharkhand: Fire breaks out in a residential apartment in Ranchi. The reason for the fire is yet to be ascertained.
More details awaited. pic.twitter.com/jewSPNq4zT
— ANI (@ANI) December 26, 2025
Also Read..
Railway Ticket Fares | ప్రయాణికులకు అలర్ట్.. పెంచిన రైలు చార్జీలు నేటి నుంచి అమల్లోకి
బైక్‌లు, కార్లు, థాయ్‌లాండ్ ట్రిప్‌లు!
Earthquake | గుజరాత్‌లోని కచ్‌లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు