Mohanlal | మోహన్ లాల్ పరువు పోయింది.. రూ.70 కోట్ల సినిమాకి తొలి రోజు కేవలం రూ.70లక్షలేనా?
Mohanlal | భాషల హద్దులు దాటి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న అరుదైన నటుల్లో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఒకరు. సహజమైన నటన, సింపుల్ బాడీ లాంగ్వేజ్, పాత్రలో పూర్తిగా లీనమయ్యే తీరు ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ మోహన్‌లాల్‌కు విశేషమైన అభిమాన వర్గం ఉంది.
Mohanlal | భాషల హద్దులు దాటి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న అరుదైన నటుల్లో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఒకరు. సహజమైన నటన, సింపుల్ బాడీ లాంగ్వేజ్, పాత్రలో పూర్తిగా లీనమయ్యే తీరు ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ మోహన్‌లాల్‌కు విశేషమైన అభిమాన వర్గం ఉంది. ఆయన సినిమా అంటే తప్పకుండా కంటెంట్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా ఉండటంతో, ఆయన నుంచి వచ్చే ప్రతి చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ కానుకగా విడుదలైన మోహన్‌లాల్ తాజా చిత్రం ‘వృషభ’ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
సినిమా విడుదలకు ముందు విడుదలైన టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన లభించడంతో పాటు, మోహన్‌లాల్‌ను పవర్ఫుల్ పాత్రలో చూపిస్తున్నారన్న ప్రచారం సినిమాపై హైప్‌ను పెంచింది. నందకిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాగిణి ద్వివేది కీలక పాత్రలో నటించగా, సమర్జిత్ లంకేష్, నయన్ సారిక మరో జంటగా కనిపించారు. అజయ్, వినయ్ వర్మ, భద్రం తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. డిసెంబర్ 25న మలయాళం, తెలుగులో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేశారు.అయితే థియేటర్లలో అడుగుపెట్టిన తర్వాత ‘వృషభ’ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయి స్పందన రాకపోవడంతో పాటు, తొలి రోజు వసూళ్లు ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురి చేశాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘వృషభ’ మొదటి రోజు నెట్ కలెక్షన్లు కేవలం రూ.70 లక్షలకే పరిమితమయ్యాయి. ఇది మోహన్‌లాల్ కెరీర్లోనే అత్యల్ప ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలవడం గమనార్హం.
వసూళ్ల పరంగా చూస్తే మలయాళ వెర్షన్ నుంచే ఎక్కువ ఆదాయం వచ్చింది. మలయాళంలో సినిమా సుమారు రూ.46 లక్షలు రాబట్టగా, తెలుగులో దాదాపు రూ.13 లక్షలు మాత్రమే వసూలు చేసింది. హిందీ వెర్షన్ పరిస్థితి మరింత నిరాశాజనకంగా ఉండి, అక్కడ కేవలం రూ.2 లక్షల నెట్ కలెక్షన్లే నమోదయ్యాయి. మొదటి రోజు నుంచే సినిమాపై నెగటివ్ టాక్ రావడం వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపింది. కథ, కథనంలో బలహీనతలు ఉన్నాయన్న అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతుండటంతో, వీకెండ్లో సినిమా పుంజుకుంటుందా అనే సందేహాలు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రివ్యూలు అనుకూలంగా లేకపోవడం సినిమా భవిష్యత్తుపై ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి భాషలకు అతీతంగా భారీ క్రేజ్ ఉన్న మోహన్‌లాల్ సినిమా నుంచి ఇంత తక్కువ స్థాయి ఓపెనింగ్స్ రావడం సినీ వర్గాలకు షాక్ ఇచ్చింది. స్టార్ పవర్ మాత్రమే సరిపోదని, కంటెంట్ బలంగా లేకపోతే ప్రేక్షకులు ఆదరించరన్న వాస్తవాన్ని ‘వృషభ’ మరోసారి రుజువు చేసిందని చెప్పవచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

