రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న లాక్డౌన్ మధ్య మందులు కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చిన ఓ యువకుడిని సూరజ్‌పూర్ జిల్లా కలెక్టర్ రణవీర్ శర్మ చేయి చేసుకోవడంతో పాటు అతని ఫోన్‌ను ధ్వంసం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనమైంది. ఉన్నత స్థాయి అధికారి ఉండి ఆయన వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. రణ్వీర్ శర్మను తక్షణమే విధులను నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు కలెక్టర్ శర్మను సస్పెండ్ చేసినట్లు సీఎం భూపేశ్ బఘేల్ ఆదివారం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. విచారకర సంఘటన అనీ, ఇలాంటి చర్యలను సహించమని స్పష్టం చేశారు. యువకుడి కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. ఐఏఎస్ అధికారుల సంఘం సైతం కలెక్టర్ చర్యలను తీవ్రంగా ఖండించింది. ఘటనపై ఐఏఎస్ అధికారుల సంఘం సైతం స్పందించింది. ఘటన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, సివిల్ సర్వెంట్ల ప్రాథమిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉందని పేర్కొంది. సమాజం పట్ల సివిల్ సర్వెంట్లు సానుభూతిని కలిగి ఉండాలని, ఈ క్లిష్ట సమయంలో మరింత ముఖ్యమని చెప్పింది.
ఘటన వివరాల్లోకి వెళితే..
కరోనా మహమ్మారి కేసుల పెరుగుదలతో ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. సూరజ్‌పూర్‌లో శనివారం లాక్డౌన్ అమలును కలెక్టర్ రణవీర్ శర్మ.. అటువైపు వస్తున్న ఓ యువకుడిని పిలిచాడు. ఎటు వెళ్తున్నావని ప్రశించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే యువకుడిని పంపించి వేశారు. మళ్లీ వెంటనే వెనక్కి పిలిచి.. యువకుడి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను తీసుకొని నేలకేసి కొట్టారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే సదరు యువకుడి చెంప చెల్లుమనిపించాడు. అలాగే అక్కడికి పోలీసులు చేరుకోగా.. యువకుడిని కొట్టాలని ఆదేశించారు. అయితే, సదరు యువకుడు వైద్య పరీక్షలు, మందుల కోసం బయటకు వెళ్తున్నానని చెప్పినట్లు తెలుస్తోంది.
ఎంత చెప్పినా.. చేతిలో ఉన్న పేపర్‌ను చూపేందుకు ప్రయత్నించినా కనీసం పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనను రికార్డు చేసి ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. వీడియో వైరల్‌గా మారింది. కలెక్టర్‌కు వ్యతిరేకంగా ట్విట్టర్లో హ్యాష్‌టాగ్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. ఘటనపై కలెక్టర్ ఓ వీడియో పోస్ట్ చేశారు. సదరు యువకుడు తొలుత టీకా కోసం బయటకు వెళ్తున్నానని చెప్పాడని, సంబంధిత పత్రాలు అడిగితే అతని వద్ద లేవని పేర్కొన్నారు. మళ్లీ తన బామ్మ దగ్గరకు వెళ్తున్నా మాట మార్చాడని.. దీంతో కోపంతో కొట్టినట్లు తెలిపారు. అయితే, తన ప్రవర్తనపై పశ్చాతాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పారు.
वाकई हद है ये…
— Anshuman Sharma (@anshuman_sunona) May 22, 2021
यकीन नहीं तो ये वीडियो भी देख लीजिये..@SurajpurDist कलेक्टर साहब आपको किस बात की इतनी खीज..
लड़का कह रहा, भगवान कसम फ़ोन पे कोई रिकॉर्ड नहीं किया..पर वाह रे दंभ..@bhupeshbaghel @tamradhwajsahu0 @_SubratSahoo @DPRChhattisgarh #lockdown #Chhattisgarh #cgnews https://t.co/GhFmnf1qa4 pic.twitter.com/ZLAdkVlhLo
किसी भी अधिकारी का शासकीय जीवन में इस तरह का आचरण स्वीकार्य नहीं है।
— Bhupesh Baghel (@bhupeshbaghel) May 23, 2021
इस घटना से क्षुब्ध हूँ। मैं नवयुवक व उनके परिजनों से खेद व्यक्त करता हूँ।
The IAS Association strongly condemns the behaviour of Collector Surajpur, Chhattisgarh.
— IAS Association (@IASassociation) May 23, 2021
It is unacceptable & against the basic tenets of the service & civility.
Civil servants must have empathy & provide a healing touch to society at all times, more so in these difficult times.