e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home టాప్ స్టోరీస్ జాబ్‌ ఎర.. 40 లక్షలు దోపిడీ

జాబ్‌ ఎర.. 40 లక్షలు దోపిడీ

జాబ్‌ ఎర.. 40 లక్షలు దోపిడీ
  • ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం పేరుతో సైబర్‌ మోసం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాల పేరుతో సైబర్‌ నేరగాళ్లు రూ.లక్షలు దోచేస్తున్నారు. ఇలా హైదరాబాద్‌కు చెందిన అక్కాచెల్లి నుంచి ఏకంగా రూ.40 లక్షలు నొక్కేశారు. మంగళ్‌హాట్‌కు చెందిన ఇంద్రేశ్వరి మాన్‌స్టర్‌.కామ్‌లో రెజ్యూమ్‌ అప్‌లోడ్‌ చేసింది. అది చూసిన సైబర్‌ నేరగాళ్లు.. విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలున్నాయంటూ ఆమెకు మెయిల్‌ చేశారు. ఆపై ఫోన్‌చేసి నమ్మించారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు, డాక్యుమెంటేషన్‌ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్‌, హెల్త్‌ చెకప్‌, అకౌంట్‌ ఓపెనింగ్‌ పేరిట దఫదఫాలుగా డబ్బు వసూలు చేశారు. ఇదే సమయంలో తమ సోదరి కూడా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుందని బాధితురాలు చెప్పడంతో.. ఎయిర్‌లైన్స్‌లో హెచ్‌ఆర్‌ మేనేజర్‌ పోస్టు ఖాళీగా ఉన్నదని నేరగాళ్లు మళ్లీ న మ్మించారు. డిపాజిట్‌ పేరిట ఆమె నుంచి డబ్బు కూడా వసూలుచేశా రు. నెల వ్యవధిలో ఇద్దరి నుంచి రూ. 40 లక్షలు వసూలుచేసిన సైబర్‌నేరగాళ్లు.. మరింత డబ్బు అడగడంతో బాధితులు అనుమానించారు. శనివారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జాబ్‌ ఎర.. 40 లక్షలు దోపిడీ

ట్రెండింగ్‌

Advertisement