ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య
ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య | ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు.

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఆస్తి వివాదం నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అయోధ్య జిల్లాలోని మిల్కిపూర్ తాలుకాలోని బారియా నిశారు గ్రామానికి చెందిన రమేశ్ కుమార్ (35) అనే వ్యక్తి తన మేనల్లుడు పవన్‌తో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నాడు. అయితే, మామా అల్లుళ్ల మధ్య భూ విషయంలో గొడవలున్నాయి. ఈ క్రమంలో అయితే.. మామా అల్లుడి మధ్య చాలా రోజులుగా ఓ భూమి విషయంలో తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో పవన్ శనివారం రాత్రి రమేశ్ కుమార్, అతని భార్య జ్యోతి, ఇద్దరి కొడుకులు, కూతురు పదునైన కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.
అనంతరం ఇంట్లో నుంచి పారిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న జిల్లా మేజిస్ట్రేట్ అనూజ్ కుమార్ ఝా, ఎస్ఎస్పీ శైలేశ్ కుమార్ పాండే, ఎస్పీ శైలేంద్ర సింగ్ ఘటనాస్థలికి చేరుకొని, మృతదేహాలను పరిశీలించారు. నిందితుడిని పట్టుకునేందుకు ఐదు బృందాలు గాలిస్తున్నాయని శైలేష్ కుమార్ పాండే తెలిపారు. హత్యకు గురైన చిన్నారుల వయస్సు 4, 6, 8 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
జాబ్ ఎర.. 40 లక్షలు దోపిడీ
ఉద్యోగుల కుటుంబాలకూ టీకా
సీబీఎస్ఈ పరీక్షలపై రక్షణ మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష
మణిపూర్‌లో భూకంపం
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు?
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మేలో 12వ సారి పెంపు
రెండు దశాబ్దాల తర్వాత బద్దలైన అగ్నిపర్వతం
దేశంలో మూడు లక్షలకు చేరువలో కరోనా మరణాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

