ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు?
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు? | ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పరిస్థితి కాస్త మెరుగుతుపడుతున్నా.. ప్రభుత్వం మరో వారం లాక్డౌన్ పొడగించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

న్యూఢిల్లీ : ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పరిస్థితి కాస్త మెరుగుపడుతున్నా.. ప్రభుత్వం మరో వారం లాక్డౌన్ పొడగించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారీగా పెరిగిన రోజువారీ కేసుల మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గత నెల 19న లాక్డౌన్ విధించారు. ఆ తర్వాత పలుసార్లు పొడగిస్తూ వచ్చారు. చివరిసారిగా ఈ నెల 16న లాక్డౌన్ పొడగిస్తూ ప్రకటించారు. ఈ నెల 24న ఉదయం 5 గంటలతో గడువు ముగియనుంది. ఢిల్లీలో నిన్న 2,200 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 3.5శాతానికి తగ్గింది.
అయితే, కరోనా కేసులు కాస్త తగ్గినా.. వైరస్ నుంచి పూర్తిగా బయటపడినట్లు కాదని.. కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లాక్డౌన్ సడలింపులపై లెఫ్టినెంట్ గవర్నర్‌తో చర్చలు జరిపి, నిర్ణయం ప్రకటిస్తామని శుక్రవారం సీఎం తెలిపారు. రెండో వేవ్ ప్రాణాంతకమని, అయితే లాక్డౌన్ సడలింపు అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని, మరో వారం రోజులు పొడగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఇవి కూడా చదవండి..
జాబ్ ఎర.. 40 లక్షలు దోపిడీ
ఉద్యోగుల కుటుంబాలకూ టీకా
సీబీఎస్ఈ పరీక్షలపై రక్షణ మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష
మణిపూర్‌లో భూకంపం
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- Delhi
- Delhi Govt
- Extention
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

