భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మేలో 12వ సారి పెంపు
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు | ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరగా.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచాయి.

న్యూఢిల్లీ : ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరగా.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. ఇంతకు ముందు శుక్రవారం ధరలు పెరగ్గా.. ఒక రోజు విరామం తర్వాత తాజాగా ఆదివారం పెట్రోల్‌పై లీటర్‌కు 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు వరకు పెంచాయి. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.21, డీజిల్ రూ.84.07కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబై నగరంలో దాదాపు వందకు చేరువైంది. లీటర్ పెట్రోల్ రూ.99.49, డీజిల్ రూ.91.30కు పెరిగింది.
చెన్నైలో పెట్రోల్ రూ.94.86 డీజిల్ రూ.88.87, కోల్‌కతాలో పెట్రోల్ రూ.93.27, డీజిల్ రూ.86.91, హైదరాబాద్‌లో రూ.96.88, డీజిల్ రూ.91.65, జైపూర్‌లో పెట్రోల్ రూ.99.68, డీజిల్ రూ.92.78కు చేరాయి. మే నెలలో ఇప్పటి వరకు 12 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఇప్పటి వరకు పెట్రోల్‌పై దాదాపు రూ.2.81, డీజిల్‌పై రూ.3.34 పెంచాయి. పెట్రోల్ రిటైల్ అమ్మకపు ధరలో 60 శాతం, డీజిల్‌లో 54 శాతానికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ.32.90, డీజిల్‌పై రూ .11.80 వసూలు చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
జాబ్ ఎర.. 40 లక్షలు దోపిడీ
ఉద్యోగుల కుటుంబాలకూ టీకా
సీబీఎస్ఈ పరీక్షలపై రక్షణ మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష
మణిపూర్‌లో భూకంపం
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

